గుడ్లు ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం. ఎ, డి, ఇ, కె, బి తదితర విటమిన్లు గుడ్డులో లభిస్తాయి. సమతుల ఆహారం తీసుకోవాలనుకునేవారు తప్పకుండా గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మంచి కొవ్వును గుడ్లు అందిస్తాయని పలు పరిశోధనలు తెలియజెబుతున్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ముందుగా కనిపించే వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి గుడ్లు తోడ్పడతాయి
TV9 Telugu
అందుకే గుడ్లు ఆరోగ్యానికి ఒక వరంలా భావిస్తారు. అయితే కొందరు గుడ్లు తినడం వల్ల నిజంగా బరువు పెరుగుతారని భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ బి2, భాస్వరం, సెలీనియం, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6 ఉంటాయి. వీటితోపాటు గుడ్లలో ప్రోటీన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది
TV9 Telugu
ఇందులోని ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మత్తుకు చాలా అవసరం. అవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే గుడ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు
TV9 Telugu
కానీ పోషకాహార నిపుణుల ప్రకారం గుడ్లు తినడం వల్ల బరువు పెరగదు. గుడ్లులోని ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచడానికి సహాయపడుతుంది
TV9 Telugu
తద్వారా అధికంగా తనిడాన్ని నిరోధించి బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. వెన్న, నూనె, సుగంధ ద్రవ్యాలతో గుడ్లు వేయించడం కంటే ఉడికించిన గుడ్లు తినడం మంచి ఎంపిక
TV9 Telugu
ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకో గుడ్డు తినడం మంచిది