ప్రపంచవ్యాప్తంగా తీపిపానీయాల మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతోంది. తీపిపానీయాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు, 12 లక్షల హృద్రోగ కేసులు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది
TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా తీపిపానీయాల మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతోంది. తీపిపానీయాలు వేగంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెంచుతాయి
TV9 Telugu
కానీ పోషక విలువ తక్కువ. వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్టరాల్ పెరగడం, టైప్ 2 డయాబెటిస్, హృద్రోగాలతో సంబంధం ఉన్న జీవక్రియల్లో సమస్యలు ఏర్పడతాయి
TV9 Telugu
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులివే. ఈ పానీయాల వల్ల మహిళలకన్నా పురుషులు, పెద్ద వారి కన్నా యువత ఎక్కువగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారు
TV9 Telugu
అయితే శీతల పానీయాలు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే శీతల పానీయాలలో అధిక మొత్తంలో సోడియం, చక్కెర ఉంటాయి. వీటి కారణంగా రక్తపోటు పెరుగుతుంది
TV9 Telugu
శీతల పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. ఇది రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
కొన్ని శీతల పానీయాలలో కెఫిన్ కూడా ఉంటుంది. వీటివల్ల తాత్కాలికంగా రక్తపోటును పెరుగుతుంది. కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది
TV9 Telugu
కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. శీతల పానీయాలలో అధిక మొత్తంలో సోడియం, చక్కెర, కెఫిన్ ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి అధిక రక్తపోటు ఉన్న రోగులు శీతల పానీయాలు తీసుకోవడం మానుకోవాలి