ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే... ఒక కప్పు చాయ్ తాగితే భలే ఉంటుంది కదా! మరి ఆ చాయ్ రోజులో ఒకసారైనా తీసుకుంటే మహిళల్లో రక్తహీనత తగ్గి, పోషకాల శాతం పెరుగుతుందట
TV9 Telugu
టీ ద్వారా ఫోలిక్ యాసిడ్‌ను శరీరం గ్రహిస్తుంది. మహిళలకు వచ్చే పలురకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా ఇది కాపాడుతుందని తేలింది. టీలో ఉండే బి12 ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో తోడ్పడుతుంది
TV9 Telugu
ఎముకలను ఆరోగ్యంగా ఉంచి, ఆస్టియో పొరోసిస్‌ను దూరం చేస్తుంది. ఒత్తిడిని దరికి చేరనివ్వదు. అనారోగ్యాల నుంచి పరిరక్షిస్తుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
TV9 Telugu
అయితే టీ వల్ల లాభాలు ఉన్నప్పటికీ టీ తాగిన వెంటనే తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే టీలోని టానిన్లు శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలకు ఇది దారితీస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా టీ తాగిన వెంటనే ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది
TV9 Telugu
టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే నీళ్లు తాగవద్దు. టీ తాగిన వెంటనే పెరుగు, మజ్జిగ కూడా తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి
TV9 Telugu
టీ తాగిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం అంత మంచిది కాదు. దీనివల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని టీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించకుండా నిరోధించే అవకాశం ఉంది
TV9 Telugu
టీ తాగిన వెంటనే కేకులు, చాక్లెట్లు, స్వీట్లు వంటి తీపి పదార్ధాలు తినడం మానుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది