సీతాఫలం  ఎవరు తినకూడదో తెలుసా? వీరు తింటే ప్రమాదమే!

04 october 2025

Samatha

సీతాఫలం సీజనల్ ఫ్రూట్, ఇది వర్షాకాలంలో మాత్రమే మార్కెట్‌లో లభిస్తుంది. అందువలన దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు వైద్య నిపుణులు.

ఎందుకంటే సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ , ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి.

అలాగే ప్రతి రోజూ ఉదయం ఒక్క సీతాఫలం తినడం వలన జీర్ణసమస్యలు తొలిగిపోయి, మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇది ఆరోగ్య పరంగానే కాకుండా, మంచి రుచిని కలిగి ఉంటుంది. తీపి రుచిని కలిగి ఉండి తినేకొద్దీ తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

అయితే సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ కొంత మంది మాత్రం వీటిని అస్సలే తినకూడదంట. కాగా, ఎవరు ఈ ఫ్రూట్ తినకూడదో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు ఈ పండుకు ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. సీతాఫలంలో చక్కెర అధికంగా ఉండటం వలన ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది.

అదే విధంగా కఫం సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా మితంగా సీతాఫలాలు తినాలంట. దీని వలన కఫం సంబంధ సమస్యలు పెరిగే  ఛాన్స్ ఉన్నదంటున్నారు వైద్య నిపుణులు.

అలాగే జలుబు, దగ్గు సమస్యల, తుమ్ముల సమస్యతో బాధపడే వారు, ఉబ్బసం ఉన్న వారు అస్సలే ఎక్కువగా సీతాఫలాలు తినకూడదంట. దీని వలన సమస్యలు తీవ్రతరం అవుతాయంట