వీరికి పసుపు కలిపిన పాలు యమ డేంజర్.. తాగారో కైలాసానికే!
14 June 2025
TV9 Telugu
TV9 Telugu
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక గ్లాసు పాలు తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలల్లో కాస్త పసుపు కలిపి రోజూ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మరెన్నో లాభాలు చేకూరుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
పసుపు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
TV9 Telugu
చర్మం మీద ఉండే మృత కణాలను తొలగించి, చర్మం మెరిసేలా చేస్తుంది. కళ్ల కింద వచ్చే నల్లని వలయాలను తొలగిస్తుంది. ఎండవేడికి వచ్చే టాన్‌ను తొలగిస్తుంది
TV9 Telugu
చర్మానికి మెరుపుదనాన్ని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగండి. హాయిగా నిద్రపడుతుంది
TV9 Telugu
పసుపు కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సీడెంట్లు వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా చేస్తాయి. చర్మం మీద మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది. అధిక మంది పసుపు పాలు తాగడానికి ఆసక్తి చూపుతారు..
TV9 Telugu
అయితే పసుపు కలిపిన పాలు అందరికీ మేలు చేయవు. కొంతమందికి పసుపు కలిపిన పాలు తాగడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా చర్మ అలెర్జీలు ఉన్నవారు పసుపు పాలు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
లేకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అలాగే తరచుగా కడుపు నొప్పులతో బాధపడేవారు పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపు పాలలో ఉండే కర్కుమిన్ పాలీఫెనాల్ కడుపు నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
వికారం, వాంతులు లేదా విరేచనాలు ఉన్న కొందరు వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కలిపిన పాలు తాగకూడదు. కడుపు సమస్యలు, పిత్త వాహిక సమస్యలు ఉన్నవారు పసుపు పాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు