మన జీవనశైలిలో ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ ఉండాల్సిందే. దాన్నో ఇంధనంలా భావిస్తాం. సమయానికి అది పడకపోతే... బండి ముందుకు కదలదు చాలామంది ఆడవాళ్లకు
TV9 Telugu
కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చేటు చేస్తుంది అంటున్నారు నిపుణులు. శరీరంలోని ఆల్కలైన్, యాసిడ్లు నిద్ర తరవాత కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే టీ తాగే అలవాటు వాటిని మరింత ప్రభావితం చేసి... జీవక్రియా రేటును తగ్గిస్తుంది
TV9 Telugu
దాంతో దీర్ఘకాలంలో జీర్ణసంబంధిత సమస్యలు మొదలవుతాయి. పైగా దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయి... దంత సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది
TV9 Telugu
ఇది శరీరంలోని నీటి స్థాయుల్ని తగ్గిస్తుంది. దాంతో డీహైడ్రేషన్‌కు గురవుతాం. నిజానికి రాత్రి నిద్ర వల్ల శరీరం ముందునుంచే డీహైడ్రేట్ అయి ఉంటుంది. దానికి టీ కూడా జతైతే... అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి
TV9 Telugu
అలాగే టీ తాగిన వెంటనే తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇవి టీలోని టానిన్లు శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. ఇది గ్యాస్, అసిడిటీ సమస్యలకు దారితీస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా టీ తాగిన వెంటనే ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలు తినవద్దు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే టీ తాగిన వెంటనే నీరు తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి
TV9 Telugu
టీ తాగిన వెంటనే పెరుగు, మజ్జిగ కూడా తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ తాగడం కూడా అంత మంచిది కాదు. దీనివల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది
TV9 Telugu
ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని టీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించకుండా నిరోధిస్తుంది. టీ తాగిన వెంటనే స్వీట్లు తినడం మానుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది