బొప్పాయితో ఈ పండు కలిపి తింటే తిప్పలు తప్పవ్‌..!

17 February 2025

TV9 Telugu

TV9 Telugu

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... ఇది బొప్పాయితో లాభం. అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు

TV9 Telugu

విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఫైబర్‌, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు... లాంటి పోషకాలెన్నో ఉంటాయి బొప్పాయిలో. దీన్లో అధిక మోతాదులో ఫైబర్‌ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది

TV9 Telugu

ఇలా పోషకాలు సమృద్ధిగా కలిగిన బొప్పాయిని అన్ని వయసుల వారు హాయిగా తినొచ్చు. అయితే ఈ పండును కొన్ని పండ్లతో కలిపి అస్సలు తినకూడదు. ముఖ్యంగా అరటి పండుతో దీనిని కలిపి తినకూడదు

TV9 Telugu

అరటి, బొప్పాయి.. ఇవి రెండు విభిన్న స్వభావాలు కలిగిన పండ్లు. వీటిని కలిపి తినడం మంచిది కాదని వైద్యులు అంటున్నారు

TV9 Telugu

బొప్పాయి, అరటిపండు కలిపి తినడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, ఆమ్లత్వం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలెర్జీలు వస్తాయి. అంతే కాదు, ఈ రెండు పండ్లను తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి

TV9 Telugu

ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. బొప్పాయి శరీరానికి వేడి చేస్తుంది. కాబట్టి విభిన్న స్వభావం కలిగిన వీటిని కలిపి తినడం అంత మంచిది కాదు

TV9 Telugu

ఈ పండ్లలోని పోషకాలు విడివిడిగా తినేటప్పుడు మాత్రమే ప్రయోజనాలను అందిస్తాయి. లేదంటే అనారోగ్యానికి కారణం కావచ్చు. ముఖ్యంగా వీటిని శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తినకూడదు

TV9 Telugu

అరటిపండ్లు, బొప్పాయి.. ఈ సమస్యలను మరింత పెంచుతాయి. అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే వీటిని విడిగా తినడం మంచిది