ఓట్స్ ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం!

04 February 2025

TV9 Telugu

TV9 Telugu

ఓట్స్‌ తరచూ తిన్నప్పటికీ.. అవి వేటి నుంచి తయారవుతాయో కొందరికి తెలియకపోవచ్చు. ఇవి ‘ఎవేనా సేటివా’ అనే మొక్క విత్తనాల నుంచి వస్తాయి. ఈ మొక్కలు చూడటానికి గోధుమ, బార్లీ తరహాలో ఉంటాయి

TV9 Telugu

ఓట్స్‌లో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్, ఫొలేట్, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం, బి1, బి3, బి5, బి6 విటమిన్లు, థయామిన్ వంటి పోషకాలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం

TV9 Telugu

ఓట్స్‌ తినడం వల్ల రక్త సరఫరా సాఫీగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య తలెత్తదు. టైప్‌2 డయాబెటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయం రాదు

TV9 Telugu

చర్మం మీద మంట, దురద వంటి ఇబ్బందులు తొలగుతాయి. ముఖానికి కాంతి వస్తుంది. పిల్లలకు క్రమం తప్పకుండా ఓట్స్‌ ఇస్తుంటే.. బాల్యంలో ఎదురయ్యే శ్వాసకోశ సంబంధమైన సమస్యల నుంచి తప్పించినట్లవుతుంది

TV9 Telugu

అయితే ఓట్స్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం వీటిని అస్సలు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా కడుపు నొప్పి, విరేచనాలు, అపానవాయువు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ తినకుండా ఉండటానికి ప్రయత్నించాలి

TV9 Telugu

అలాగే అలెర్జీలతో బాధపడేవారు ఓట్స్ తినకూడదు. చర్మంపై దురద సమస్యలు వంటి అలెర్జీలతో బాధపడేవారు ఓట్స్ తినకుండా ఉండాలి. ఇందులో భాస్వరం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది 

TV9 Telugu

అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఓట్స్ తినకూడదు. అలాగే మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే వైద్యుడిని అడిగిన తర్వాతే ఓట్స్‌ తీసుకోవడం మంచిది