ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఏమవుతుంది?
01 October 2025
TV9 Telugu
TV9 Telugu
చాలా మంది నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు. ఈ అలవాటు ప్రయోజనకరమైనదే అయినప్పటికీ దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
నిజానికి, గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
కానీ ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలోని ఆమ్లత్వం ఎముకలలో కొవ్వును తగ్గించి బలహీనంగా మారుస్తాయి
TV9 Telugu
నిమ్మకాయలోని ఆమ్లత్వం దంతాలను దెబ్బతీస్తుంది. వాటిని సున్నితంగా మారుస్తుంది. అంతే కాదు దంతాల బలాన్ని కూడా తగ్గిస్తుంది
TV9 Telugu
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది
TV9 Telugu
అందుకే మ్మరసాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి
TV9 Telugu
నిమ్మకాయలోని కొన్ని లక్షణాలు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం అంత మంచిది కాదు
TV9 Telugu
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల విరేచనాలు, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. దానిలోని ఆమ్లత్వం గొంతు నొప్పికి కూడా కారణమవుతుంది