మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువే. నూనె పైకి తేలేంతవరకు ఉడికించటం చూస్తూనే ఉంటాం. కొందరు వండిన తర్వాతా పైన నూనె పోస్తుంటారు. వీటికి తోడు వనస్పతి, నెయ్యి వంటి వాటికి ఇక అదుపే ఉండదు
TV9 Telugu
నిజానికి, ఏ నూనె అయినా ఎక్కువగా వాడటం ఎంతమాత్రమూ మంచిది కాదు. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముంది. ఇది అధిక రక్తపోటు, గుండెజబ్బులకు దారితీస్తుంది. ఒకసారి మరిగించిన వంట నూనెను మరోసారి వాడకూడదు. ఇళ్లలోనూ ఇదే నియమం వర్తిస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా అధిక కొవ్వ ఉండే నెయ్యి, వనస్పతిలను వంటలలో ఒకే ప్రయోజనాల కోసం ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. ఆరోగ్య పరంగా వాటి మధ్య ప్రాథమిక తేడాలు ఉన్నాయి. అలాగే ఏది మంచిది, ఆరోగ్యకరమైనదనే ప్రాథమిక తేడాలు ఉన్నాయి
TV9 Telugu
నెయ్యి అనేది వెన్న కరిగించడం ద్వారా తయారయ్యే శుద్ధి చేసిన పాల కొవ్వు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సంయోజిత లినోలెయిక్ ఆమ్లం (CLA), విటమిన్లు A, D, E, K ఉంటాయి
TV9 Telugu
ఈ పదార్థాలు శరీర కణాలను మరమ్మతు చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆయుర్వేదంలో నెయ్యిని సాత్విక ఆహారం అని పిలుస్తారు. దీనిని మితంగా తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
వనస్పతి నెయ్యి అనేది హైడ్రోజనేషన్ ద్వారా కూరగాయల నూనెను చిక్కగా చేసి తయారు చేసేన కృత్రిమ నెయ్యి. ఇది అచ్చంగా నెయ్యిని పోలి ఉంటుంది. కానీ ఇది ఒక రకమైన ట్రాన్స్ ఫ్యాట్
TV9 Telugu
ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక మార్కెట్లో లభించే కల్తీ డాల్డాలు ఆరోగ్యానికి మరింత హానికరం
TV9 Telugu
ఆరోగ్యానికి హానిచేసే వనస్పతి నెయ్యి అనేక దేశాలలో నిషేధం ఉంది. కానీ ఆరోగ్య పరంగా వనస్పతి కంటే నెయ్యి మంచిది. ఇది సహజమైనది, పోషకమైనది, సులభంగా జీర్ణమవుతుంది. కానీ గుర్తుంచుకోండి..నెయ్యి ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది