ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ వంటి సరళ పిండి పదార్థాలు సత్వరం శక్తినిస్తాయి
ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయి. జియాగ్జాంతిన్ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది. కణాలకు పొటాషియం అత్యవసరం
TV9 Telugu
ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది
TV9 Telugu
మీరెప్పుడైనా ఖర్జూరాలను నెయ్యితో కలిపి తిన్నారా? ఇలా తీసుకుంటే బోలెడన్నా ఆరోగ్యా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే అనేక రకాల విటమిన్లు, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయట
TV9 Telugu
ఇందులోని ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అనేక రకాల విటమిన్లు శరీర సరైన పనితీరుకు కావల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా నెయ్యి, ఖర్జూరం కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
ఈ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల బరువు పెరగడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అయితే ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలున్న వారు మాత్రం దీన్ని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిల్లోని అధిక కేలరీలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి