ఖర్జూరతో ఆరోగ్యం.. బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఇది వరం!
10 october 2025
Samatha
ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ ఒకటి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఖర్జూర పొటాషియం , మెగ్నీషియం, రాగి, విటమిన్ బీ6 వంటివి పుష్కలంగా ఉండటంతో ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి అవసరమైన పొటాషియం అందిస్తాయి.
ఖర్జూరాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ప్రతి రోజూ మీ డైట్ లో ఖర్జూర చేర్చుకుంటే ఇది మీ జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్ధక సమస్య తగ్గిస్తుంది
ఖర్జూర డయాబెటీస్ పేషెంట్స్ కు వరం అని చెప్పాలి. ఇందులోని కేలరీలు సహజమైన తీపినిస్తాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ వీటిని తినొచ్చు. కానీ మితంగా తీసుకోవాలి.
ఖర్జూరాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఇవి క్యాన్సర్, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
ఖర్జూరాలు తీపి ఉన్నప్పటికీ ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.
ఖర్జూరాలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ దీనిని తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయంట.
ఖర్జూరాలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కలయిక రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.