క్రిస్పీ ఎగ్ పకోడా.. మీరెప్పుడైనా ట్రై చేశారా? రుచి అదుర్స్..

21 August 2025

TV9 Telugu

TV9 Telugu

వాతావరణం ఏ కాస్త చల్లబడినా... నాలుగు చినుకులు పడుతున్నా... వేడివేడి టీకి జతగా పకోడీలూ తినాలనిపిస్తుంది. లేటెందుకు... ఆ పకోడీలేవో వేసేద్దాం మరి. అయితే కాస్త వెరైటీగా ఇలా ట్రై చేసి చూస్తే భలేగా ఉంటాయి

TV9 Telugu

మిర్చీ, ఆలూ, వంకాయ, ఆలూ.. ఇలా రకరకాల పకోడీలు తిని ఉంటారు. కాస్త వెరైటీ ఎగ్ పకోడా తయారు చేశారంటే.. ఇంట్లో అందరి ప్రశంసలు పొందొచ్చు. ఈ  రుచికరమైన వెరైటీ పకోడీలు చట్నీలతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది

TV9 Telugu

ప్రోటీన్ పవర్‌హౌస్‌గా పరిగణించబడే గుడ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలను సరఫరా చేస్తాయి. గుడ్లతో తయారుచేసిన రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ఇష్టపడే నాన్‌ వెజ్‌ ప్రియులకు ఈ ఎగ్ పకోడా బాగా ఆకట్టుకుంటుంది

TV9 Telugu

తయారీకి 5 ఉడికించిన గుడ్లు, 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ఎర్ర కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ క్యారమ్ గింజలు, 1/8 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ గరం మసాలా తీసుకోవాలి

TV9 Telugu

అలాగే 1 స్పూన్ అల్లం, 1/2 కప్పు నీరు, డీప్ ఫ్రై చేయడానికి నూనె, 1/4 కప్పు ఉల్లిపాయ, చాట్ మసాలా, అవసరమైనంత మేరకు నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ప్రతి గుడ్డును 3-4 భాగాలుగా కోసి దానిపై ఉప్పు చల్లుకోవాలి. అయితే గుడ్లను మరీ సన్నగా ముక్కలు చేయకూడదు

TV9 Telugu

ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర, ఎర్ర కారం, ఉప్పు, క్యారమ్ విత్తనాలు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, 3/4 స్పూన్ల గరం మసాలా అన్నీ వేసి.. సరిపడా నీళ్లు పోసుకుని పిండి బాగా కలుపుకోవాలి. రుచి చూసుకుని తదనుగుణంగా మసాలు కలుపుకోవచ్చు. మరీ నీరుగా కాకుండ ముద్దగా కలుపుకోవాలి

TV9 Telugu

ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అది మీడియం వేడి అయిన తర్వాత, ముక్కలుగా కోసిన గుడ్లను శనగపిండిలో వేసి ముంచుకుని నూనెలో వదలాలి. లేదంటే చెంచాతో పూత మాదిరి పూయవచ్చు. ఆ తరువాత నెమ్మదిగా నూనెలో వదలాలి

TV9 Telugu

ఈ గుడ్డు ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు క్రిస్పీగా వేయించాలి. మీడియం మంట మీద వాటిని వేయించుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ అన్నివైపులా బంగారం రంగులో వచ్చేలా వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. అంతే ఎగ్‌ పకోడా రెడీ అయినట్లే