అందుకే.. వర్షాకాలంలో వంట నూనె త్వరగా పాడైపోతుంది..!
05 July 2025
TV9 Telugu
TV9 Telugu
నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా... వంటకానికి మంచి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్ పడాల్సిందే. అయితే నూనెను ఎలా పడితే అలా నీళ్లలా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
TV9 Telugu
మనం వినియోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఇవి ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
అయితే వంట నూనె పొదుపుగా వాడటమేకాదు.. దానిని సరైన విధానంలో నిల్వ చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడిపోతారు
TV9 Telugu
ఒకే సీసాలో ఉన్న నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం, వేడి చేయడం, ఆనక తిరిగి దానిలోనే పొయ్యడం వంటివి దాదాపు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. దీనివల్ల తేమ, మలినాలు నూనెలోకి తేలిగ్గా ప్రవేశించడమే కాదు.. ఇది ఆరోగ్యానికి కూడా హానికరం
TV9 Telugu
ఒకసారి వేడి చేసిన నూనెను తిరిగి బాటిల్‌లోకి పోయడం వల్ల నూనె త్వరగా చెడిపోతుంది. దాని పోషక విలువలు కూడా తగ్గుతాయి. బదులుగా చల్లబడిన తర్వాత, దానిని ఫిల్టర్ చేసి ప్రత్యేక పాత్రలో ఉంచడం మంచిది
TV9 Telugu
వంట నూనెలుఎల్లప్పుడూ నూనెను సూర్యకాంతి పడని ప్రదేశంలోనే ఉంచాలి. వెలుతురు, వేడి కారణంగా నూనె ఆక్సీకరణం చెంది, చెడిపోతుంది. అందుకే గ్యాస్ దగ్గర నూనె ఉంచకూడదు. అలాగే సూర్యరశ్మి కూడా నూనె నాణ్యతను దెబ్బతీస్తుంది
TV9 Telugu
నూనెను గాజు సీసాలో నిల్వ చేయడం మంచిది. ముఖ్యంగా ముదురు గోధుమ లేదా ఆకుపచ్చ సీసాలో నిల్వ చేయడం ఇంకా మంచిది. ఇది నూనెను సూర్యకాంతి నుంచి రక్షించి దాని నాణ్యతను కాపాడుతుంది
TV9 Telugu
మూత లేకుండా నూనె నిల్వ చేయకూడదు. నూనెను ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు. గాలికి గురికావడం వల్ల నూనె ఆక్సీకరణం చెందుతుంది. ఇది దాని వాసన,రుచిని పాడు చేస్తుంది