పాలకూర ఉడకబెట్టి తినాలా? పచ్చిగా తినాలా? ఎలా మంచిది..
04 May 2025
TV9 Telugu
TV9 Telugu
ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర. కానీ పాలకూర తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ దీని వల్ల బోలెడన్ని లాభాలున్నాయి. ఇందులో ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 13 రకాల యాంటీయాక్సిడెంట్లున్నాయి
TV9 Telugu
పాలకూర క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఇందులో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది. అలాగే పాలకూరలో ఇనుము, కాల్షియంతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
పాలకూర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో తగినంత ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కాకుండా పాలకూరలో ఉండే ఇతర పోషకాలు కళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ దీనిని సరైన రీతిలో, పరిమిత పరిమాణంలో తింటేనే శరీరానికి దాని ప్రయోజనం లభిస్తుంది
TV9 Telugu
పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాల్షియం శోషణను తగ్గిస్తుంది. పాలకూరను ఉడకబెట్టడం ద్వారా దాని పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా కాల్షియం, ఇతర పోషకాలు శరీరంలో సులభంగా శోషించబడతాయి
TV9 Telugu
అయితే ఉడికించినప్పుడు చాలా కూరగాయల పోషకాలు తగ్గుతాయి. కానీ పాలకూర విషయంలో ఇది రివర్స్. ఉడకబెట్టినప్పుడు పాలకూరలోని పోషకాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
పాలకూరను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి నీటిలో 2 నుండి 4 నిమిషాలు మరిగించి తీసుకోవాలి. రుచి కోసం తక్కువ నూనె, ఉప్పు, మిరియాల పొడితో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. అలాగే పాలకూర జ్యూస్, సూప్ కూడా మంచి ఎంపికే
TV9 Telugu
తక్కిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర శిరోజాలకి ఎక్కువ మేలు చేస్తుందని తెలుసా? యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పాలకూర జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతుంది