ఉప్పులేని వంటను ఊహించలేం. కాసింత తక్కువైనా ప్చ్.. ఉప్పు లేదంటూ రుచిని ఆస్వాదించలేం. ఇందులో కొన్ని రకాలున్నట్లే... వాడకంలో మనకు బోలెడు సందేహాలూ ఉన్నాయి
TV9 Telugu
ఉప్పులో అనేక రకాలున్నాయి. రాళ్ల ఉప్పు, టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ వంటివి మనం బాగా వాడేవి. హిమాలయన్ పింక్, నల్ల ఉప్పు వంటివీ ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్నారు
TV9 Telugu
రాళ్ల ఉప్పును అధికంగా శుద్ధి చేయరు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న ఉప్పుల్లో అయోడిన్‌తోపాటు ఇతర లవణాలు కలుపుతున్నారు. వీటి వల్ల బీపీ తగ్గుతుంది
TV9 Telugu
టేబుల్ సాల్ట్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడం వల్ల చూడటానికి తెల్లగా, కర్పూరంలా మెరుస్తుంది. అయోడైజ్డ్ సాల్ట్ చాలా వరకూ టేబుల్ సాల్ట్ లాగానే ఉంటుంది. రాళ్ల ఉప్పు, అయోడైజ్డ్ సాల్ట్ వాడటం మంచిది
TV9 Telugu
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఇది వాడటం మంచిది. పింక్ ఉప్పు లేత గులాబిరంగులో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇది తినడం వల్ల కండరాలు పట్టేయడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్లవాతం రావడమే కాదు, ఎముకల సాంద్రత తగ్గుతుంది. సోడియం సాల్ట్ వాడటం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది
TV9 Telugu
టేస్టింగ్ సాల్ట్‌ను ఫుడ్ సెంటర్‌లలో ముఖ్యంగా ఫ్రైడ్‌రైస్‌లలో ఉపయోగిస్తుంటారు. దీన్ని వాడటం వల్ల కాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రమాదకరం
TV9 Telugu
హైబీపీ, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అలా అని మరీ తక్కువ తిన్నా సమస్యే. ఇందులో ఉండే సోడియం క్లోరైడ్ శరీరంలో ద్రవాల సమతుల్యతకు అవసరం