చలికాలంలో ఎందుకు స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుంది?
04 December 2024
TV9 Telugu
TV9 Telugu
ప్రతి ఒక్కరూ చలికాలంలో వేడిగా, కాస్త కారంగా ఉండే ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. ఆహారం రుచిగా, ఘాటుగా తినాలనుకొనే వారు మసాలాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
TV9 Telugu
అంతేకాకుండా చలికాలంలో చిరుతిళ్ల వాసన ముక్కుకు తగిలితే చాలు నోటిలో నీళ్లు ఊరిపోతాయ్. అసలు చలికాలంలో ఇలా స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలని పిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా?
TV9 Telugu
బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, శరీరం సహజంగా వెచ్చని అనుభూతిని కోరుకుంటుంటుంది. అందుకే వేడివేడిగా స్నాక్స్ తినాలని కోరుకుంటాం
TV9 Telugu
అంతే కాకుండా ఈ సీజన్‌లో వైరస్ వల్ల అనారోగ్య సమస్యలు రావడం సహజమే. అందులోనూ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ కాలంలో షరా మామూలే
TV9 Telugu
ఈ సమయంలో జలుబు చికాకు నుండి తప్పించుకోవడానికి నోటికి ఉప్పగా, కారంగా ఉండే ఆహారాన్ని తినాలని కోరుకుంటాం. స్పైసీ ఫుడ్‌కి ఉష్ణోగ్రతను పెంచే గుణం ఉంటుంది
TV9 Telugu
ఇవి శరీరంలోని చలిని బయటకు పంపుతుంది. అందువల్లనే ఈ కాలంలో అధికమంది స్పైసీ ఫుడ్ తినేందుకు ఇష్టపడతారు. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
స్పైసీ ఫుడ్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే బరువు సులువుగా తగ్గవచ్చు. స్పైసీ ఫుడ్‌ను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి కలుగుతుంది. దీని వల్ల కడుపులో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది
TV9 Telugu
స్పైసీ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల జలుబు, తలనొప్పి, ముక్కు కారడం ఆగిపోతుంది. దగ్గు ఉన్నప్పుడు కొంచెం స్పైసీఫుడ్ తీసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది