పెరుగు తిన్న వెంటనే వీటిని తిన్నారో.. ఒంట్లో విషంగా మారుతాయ్‌!

07 March 2025

TV9 Telugu

TV9 Telugu

పెరుగుతో ఓ ముద్ద తినందే భోజనం పూర్తి కాదు చాలామందికి! అయితే కొందరు కూరల తయారీలో, ఇతర పదార్థాల్లోనూ పెరుగును వాడుతుంటారు

TV9 Telugu

పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి  మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి

TV9 Telugu

కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. ఇది శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుతుంది

TV9 Telugu

నిజానికి కొన్ని పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.  దీనివల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుందట

TV9 Telugu

ముఖ్యంగా పెరుగు తిన్న తర్వాత తర్వాత నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. ఇది కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను మరింత దిగజార్చుతుంది

TV9 Telugu

వెన్న, నెయ్యి వంటి ఇతర అధిక కొవ్వు పదార్థాలను కూడా నివారించాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవచ్చు. అలాగే చాలా మందికి పెరుగులో ఉల్లిపాయ కలిపి తినడం అలవాటు

TV9 Telugu

పెరుగులో ఉల్లిపాయ కలిపి తినడం వల్ల చర్మ అలెర్జీలు వస్తాయి. ఎందుకంటే ఉల్లిపాయ, పెరుగు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి

TV9 Telugu

అలాగే పెరుగన్నంలో వేపుళ్లు, చిప్స్‌ వంటివి నంజుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. పెరుగుతో కలిపి వీటిని తీసుకున్నప్పుడు కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి. ఇందుకు కారణం.. ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ జీర్ణక్రియను నెమ్మదించేలా చేయడమేనట