తియ్యటి కొబ్బరిని ఇష్టంగా తింటాం. కాస్తంత కూరల్లో వేస్తే.. వాటి రుచి రెట్టింపవుతుంది. చట్నీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్నీ చేకూర్చే కొబ్బరితో చాలానే పిండివంటలున్నాయి
TV9 Telugu
దాదాపు ప్రపంచం యావత్తూ విస్తరించిన అద్భుతమైన వృక్ష జాతి కొబ్బరి. కొబ్బరి చెట్టు లోను, తాటి చెట్టులోను నిరుపయోగమైన భాగమేదీలేదంటారు. కొబ్బరి చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది
TV9 Telugu
100 గ్రాముల పచ్చి కొబ్బరిలో సుమారు 350 కిలోకేలరీల శక్తి ఉంది. పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న కొబ్బరిని తినడం వల్ల మేలే జరుగుతుంది
TV9 Telugu
కొబ్బరిలోని ఐరన్, కాల్షియం, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, సెలీనియంతో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు కొబ్బరి తినకూడదని అంటుంటారు. ఇందులో నిజమెంతో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.. నిజానికి డయాబెటిస్ ఉండటం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది
TV9 Telugu
అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే తింటే మంచిదని అంటున్నారు. కొబ్బరిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి
TV9 Telugu
కొబ్బరికాయలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు అంటున్నారు. అయితే మధుమేహ రోగులు కొబ్బరిని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు