చలికాలంలో మెరిసే చర్మం కావాలా? ఐతే ఈ జ్యూస్ తాగండి
17 November 2025
TV9 Telugu
TV9 Telugu
సీజనల్ కూరగాయల్లో క్యారెట్ ఒకటి. శీతాకాలంలో మార్కెట్లో క్యారెట్లు దండిగా దర్శనమిస్తాయి. క్యారెట్లలో ఫైబర్ సహా అనేక పోషకాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి శరీరంలో రక్త స్థాయిలను పెంచుతాయి. శీతాకాలంలో, క్యారెట్లను రెండు విధాలుగా ఉపయోగిస్తారు. పుడ్డింగ్, జ్యూస్ ఈ రెండు రకాలుగా వీటిని తీసుకోవచ్చు
TV9 Telugu
క్యారెట్ జ్యూస్‌లో మరి కొన్ని కూరగాయలను జోడించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ జ్యూస్‌లో నిమ్మకాయ రసం కలిపితే మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుంది
TV9 Telugu
చర్మ రక్షణకు విటమిన్ సి చాలా అవసరం. క్యారెట్ జ్యూస్‌లో నిమ్మ, ఉసిరితో కలిపి తీసుకోవడం వల్ల కొల్లాజెన్‌ను పెంచుకోవచ్చు. విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది
TV9 Telugu
ఉసిరిలోనూ విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ జ్యూస్ ఎలా తయారు చేయడానికి క్యారెట్లు, ఒకటి లేదా రెండు ఉసిరి, నిమ్మరసం తీసుకుని మెక్సర్‌లో మెత్తగా జ్యూస్ చేసుకుంటే సరి
TV9 Telugu
ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్షణ కల్పిస్తుంది. క్యారెట్, ఉసిరి, బీట్‌రూట్, అల్లంతో చేసిన జ్యూస్‌ని కూడా ఖాళీకడుపుతో రోజూ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది
TV9 Telugu
ఈ జ్యూస్ తాగడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీన్ని నివారించడానికి జ్యూస్‌లో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలపడం మర్చిపోకూడదు
TV9 Telugu
శీతాకాలంలో జలుబు, దగ్గుతో బాధపడే వారు క్యారెట్ తినకపోవడమే మంచిది. క్యారెట్లు జలుబు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు అంటున్నారు