పూర్ణాయుష్షు కావాలా? అయితే పుట్టగొడుగులు ఇలా తినండి..

21 February 2025

TV9 Telugu

TV9 Telugu

ఎక్కువకాలం జీవించడం ఒకెత్తయితే, బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించడం మరొకెత్తు. ఇలాంటి నాణ్యమైన జీవితాన్నే అందిస్తాయట పుట్టగొడుగులు. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకుంటే డెమెన్షియా, సార్కోపెనియా(కండర క్షీణత)వంటి సమస్యలు రాకుండా ఉంటాయట

TV9 Telugu

వయసుపెరిగేకొద్దీ మనలో కొన్ని కీలకమైన ఎంజైములు తగ్గిపోతూ ఉంటాయి. ఫలితంగా శరీరంలో కండరాల క్షీణత మొదలవుతుంది. అలాగే ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. వీటికి ఎర్గోథయెనైన్‌ అనే మూలకం పరిష్కారం సూచిస్తుందట. 

TV9 Telugu

ఇది మనకి ఒత్తిడిని జయించే శక్తిని ఇవ్వడంతోపాటూ, కండరాలు క్షీణించకుండా చూస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చురుగ్గా ఉండేట్టు చేస్తుంది. అయితే ఈ మూలకాన్ని మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసుకోలేదు. పుట్టగొడుగుల నుంచీ పులియబెట్టిన ఆహారం నుంచీ ఈ మూలకాన్ని అందుకోవచ్చట

TV9 Telugu

పుట్టగొడుగులను తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ బి, డి, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం శరీరానికి అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తాయి

TV9 Telugu

చాలా మందికి పుట్టగొడుగులతో చేసిన వంటకాలంటే మహా ఇష్టం. ఇది తినడానికి కూడా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అయితే పుట్టగొడుగులను పచ్చిగా తినొచ్చా.. లేదంటే కూర లేదా తేలికగా వేయించి గ్రిల్ చేసి కూడా తినొచ్చా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా?

TV9 Telugu

పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పుట్టగొడుగులలో ఫైబర్ ఉంటుంది. పచ్చిగా తింటే, అవి గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతాయి. అందుకే పచ్చిగా తిన కూడదు

TV9 Telugu

పుట్టగొడుగులు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలో కూడా విటమిన్ బి12 కూడా పుష్కలంగా లభిస్తుంది 

TV9 Telugu

వీటిని తినడం వల్ల శరీరంలో బి12 లోపం ఇట్టే భర్తీ అవుతుంది. అలాగే పుట్టగొడుగులలో ఉండే పాలీశాకరైడ్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి