పచ్చి పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే..

13 May 2025

TV9 Telugu

TV9 Telugu

పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా.. బలంగా ఎదగాలన్నా.. పాలు తప్పనిసరి. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు దీనిని తాగమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు 

TV9 Telugu

ఇది ఎముకలను బలోపేతం చేయడంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పాలలో లాక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. ఈ లాక్టేజ్‌ ఎంజైమ్‌ పాలను గ్లూకోజు, గ్యాలక్టోజ్‌ అనే చక్కెరలుగా విడగొడుతుంది

TV9 Telugu

పాలల్లో ఎండు ద్రాక్ష నానబెట్టి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలట. ఎండుద్రాక్షలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్ష చల్లని స్వభావం కలిగి ఉంటాయి. అందుకే వేసవిలో పాలల్లో నానబెట్టి తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది

TV9 Telugu

సాధారణంగా ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటారు. కానీ వీటిని పచ్చి పాలలో కూడా నానబెట్టవచ్చు. ఎండుద్రాక్షలో ఇనుము, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ వంటి అంశాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. పాలలో కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి రెండింటి కలయిక ఎముకలు, దంతాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

నానబెట్టిన ఎండుద్రాక్షలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వీటిని పాలతో కలిపి తీసుకుంటే కడుపుని క్లియర్ చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఎండుద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అలసట తగ్గి శరీరం చురుగ్గా ఉంటుంది

TV9 Telugu

ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇది ముడతలు, మొటిమలను కూడా నివారిస్తుంది. దీన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది