పల్లీలు తినే వారికి అలర్ట్.. మీ కాలేయం డేంజర్‌లో ఉన్నట్లే!
26 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఆరోగ్యంగా ఉన్నవాళ్లూ వయసులో ఉన్నవాళ్లూ పల్లీలుగానీ పల్లీ బటర్‌గానీ తింటే, రక్తనాళాల పనితీరు మెరుగవుతుందని బార్సిలోనా యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన పరిశోధనలో స్పష్టమైందట
TV9 Telugu
వేరుసెనగల్లో సమృద్ధిగా ఉండే ఫ్యాటీ ఆమ్లాలూ ప్రొటీన్లూ పీచూ పాలీఫినాల్సూ... అన్నీ కలిసి ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్లు ప్రయోగపూర్వకంగా గుర్తించి మరీ చెబుతున్నారు
TV9 Telugu
వీటిల్లో ఉండే ప్రొస్టాసైక్లిన్-12, థ్రాంబాక్సేన్-ఎ2... వంటి వాస్క్యులర్ మార్కర్లు రక్త నాళాలను వ్యాకోచింపజేస్తున్నట్లు గుర్తించారు. అంటే పల్లీలు తినడంవల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగవుతుందనీ కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు వీటిని తగుమోతాదులో క్రమం తప్పక తీసుకోవాలని చెబుతున్నారు
TV9 Telugu
అందుకే వేరుశెనగను పోషకాల నిల్వగా కూడా పిలుస్తారు. కానీ చల్లని వాతావరణంలో వీటి అధిక వినియోగం ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
వేరుశెనగను ఎక్కువగా తింటే కాలేయం, బీపీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేరుశెనగను అధికంగా తీసుకోవడం శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది కాలేయం, గుండెను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందట
TV9 Telugu
వేరుశెనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. పైగా వేరుశెనగను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు కూడా వస్తాయి
TV9 Telugu
కాబట్టి వీటి అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 50 గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి. అలాగే పల్లీలు తినేటప్పుడు ఉప్పు లేకుండా తినాలి. ఉప్పు కలిపి తింటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ