ముదురురంగు కాయగూరల నుంచి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మామిడి, బొప్పాయి, గుమ్మడి, క్యారెట్, చిలగడదుంపలు వంటివి మేని సౌందర్యాన్ని పెంచుతాయి
TV9 Telugu
ఇందులో బట్టర్ ఫ్రూట్‌గా పిలిచే అవకాడోలో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. అందుకే అత్యధికంగా ప్రోటీన్లు అందించే అవకాడో పండును ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు
TV9 Telugu
అవకాడో గుండె, చర్మం, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు K, C, E, B6, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అయితే అవకాడో కిడ్నీ రోగులకు హానికరం అని చాలా మంది అంటుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి అవకాడోలు ఆరోగ్యకరమైన వ్యక్తులకు హానికరం కాదు. బదులుగా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
ఒక అవకాడో పండులో దాదాపు 700–900 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఈ అదనపు పొటాషియాన్ని శరీరం నుంచి సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీని వలన రక్తంలో పొటాషియం పేరుకుపోతుంది
TV9 Telugu
ఇది హైపర్‌కలేమియాకు దారితీస్తుంది. ఇది గుండె లయకు అంతరాయం కలిగిస్తుంది. ఆకస్మిక మరణానికి కూడా కారణమవుతుంది. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు అవకాడో పండు తినకపోవడమే మంచిది
TV9 Telugu
మూత్రపిండ వ్యాధి ఉన్నవారు వారి రోజువారీలో పొటాషియం 2000–2500 mg ఫిల్టర్ చేయగలుగుతుంది. అందువల్ల, అవకాడో వంటి పొటాషియం అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల పరిమితి మించిపోతుంది
TV9 Telugu
డయాలసిస్ చేయించుకుంటున్నవారు, మూత్రపిండాల పనితీరు తగ్గిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవకాడోను సాధారణంగా సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. కానీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి ఇది ప్రమాదకరం