రోజూ పచ్చటి ఆకుకూరలూ, తాజా కాయగూరలూ తింటే ఎంతో ఆరోగ్యమని అందరి నోటా వినుంటారు. కానీ శాఖాహారుల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటాయని కొందరు భావిస్తుంటారు
TV9 Telugu
ఒంట్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం, జీవనశైలి కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ల నొప్పులు, వాపు, ఇతర లక్షణాలు సంభవిస్తాయి
TV9 Telugu
నిజానికి, చాలా మంది పలు కారణాల వల్ల శాఖాహార ఆహారాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, వివిధ విటమిన్లు, పోషకాలు ఉంటాయి. కానీ శాఖాహార ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయా? అనే ప్రశ్నకు నిపుణుల మాటల్లో సమాధానం తెలుసుకుందాం
TV9 Telugu
శాఖాహారాలను తప్పుడు మార్గంలో తింటే, అంటే ఎక్కువ నూనె జోడించడం లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినడం, ఇతర పోషకాలను సమతుల్యం చేసుకోకపోతే యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణమవుతుందని అంటున్నారు
TV9 Telugu
రోజూ తగినంత నీళ్లు తాగకపోతే, కార్బోహైడ్రేట్లపై దృష్టి పెట్టకపోతే, అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు నూనె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను అమాంతం పెంచుతుంది
TV9 Telugu
కూరగాయలతో వంట చేసే ముందు వాటిని సరిగ్గా కడగాలి. అలాగే తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలను వాడాలి. అలాగే సమతుల్య పద్ధతిలో తినాలి
TV9 Telugu
ఒకేరకమైన కూరగాయను అధికంగా తినడానికి బదులుగా సీజన్ ప్రకారం ప్రతిరోజూ వివిధ రకాల కూరగాయలు, పప్పుధాన్యాలను వంటకు వినియోగించాలి
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో అప్పుడప్పుడు గోధుమ రోటీలకు బదులుగా మొక్కజొన్న, మిల్లెట్, రాగి రోటీలను తయారు చేసుకుని తినవచ్చు. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి వైద్యుడిని సంప్రదించడంతోపాటు ప్రతిరోజూ కాసేపు వ్యాయామం కూడా చేయాలి