పెరుగుతో రోజంతా జోరుగా.. హుషారుగా..

11 October 2025

TV9 Telugu

TV9 Telugu

పెరుగు పేగులకే కాదు.. మూడ్‌కూ మంచిదే. దీనిలోని ల్యాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి.. సహాయపడుతుంది

TV9 Telugu

కుంగుబాటు, ఆందోళన నివారణకు తోడ్పడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు

TV9 Telugu

ఈ బ్యాక్టీరియా ఎలుకల్లో కుంగుబాటును వెనక్కి మళ్లిస్తున్నట్టు ఇంతకుముందు బయటపడింది. అయితే దీనికి కారణమేంటన్నది తెలియరాలేదు

TV9 Telugu

ఈ నేపథ్యంలో తాజా అధ్యయనాన్ని చేపట్టారు. రోగనిరోధక వ్యవస్థలో మధ్యవర్తిగా పనిచేసే ఇంటర్‌ఫెరాన్‌ గామా మోతాదులను ల్యాక్టోబాసిలస్‌ పర్యవేక్షిస్తున్నట్టు గుర్తించారు

TV9 Telugu

ఇలా ఒత్తిడికి శరీరం స్పందించటాన్ని నియంత్రిస్తున్నట్టు.. కుంగుబాటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కనుగొన్నారు. దీంతో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ తయారీకి కొత్త సాధనాలు దొరికినట్టయ్యిందని భావిస్తున్నారు

TV9 Telugu

మానసిక సమస్యలకు కొత్త చికిత్సల రూపకల్పనకిది దారితీయగలదని ఆశిస్తున్నారు. తరచూ పెరుగు తినటం జీర్ణకోశం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

TV9 Telugu

ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో మంచి విషయమూ బయటపడింది

TV9 Telugu

వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్‌.. ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది