సొరకాయ అంటే కొందరికి అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. దీని వల్ల శరీరానికి వచ్చే లాభాలు అన్నీ, ఇన్నీ కావు
TV9 Telugu
సొరకాయలో మెగ్నీషియం, జింక్, ఫైబర్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో సంతృప్త కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని సూపర్ ఫుడ్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు
TV9 Telugu
ఇందులో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలతో పాటు మంచి మొత్తంలో అంటే 96 శాతం నీరు కూడా ఉంటుంది. సొర ఆహారంలో తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
దీన్ని క్రమం తప్పక తీసుకోవడం వల్ల దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మహిళలు తరచు ఎదుర్కొనే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది
TV9 Telugu
రక్తంలో చక్కెర స్థాయిల ఆకస్మిక పెరుగుదలను సొరకాయ నిరోధిస్తుంది. క్లోమగ్రంథి. పని తీరును మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. దీంట్లో పీచుపదార్థం ఎక్కువ, కెలోరీలు తక్కువ. బీపీ ఉన్నవారికీ మంచి ఆహారం
TV9 Telugu
జీర్ణ సమస్యల నివారణలో సొర అద్భుతంగా పని చేస్తుంది. దీని రసానికి చిటికెడు ఉప్పు కలిపి మూడు రోజులు తీసుకుంటే కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది
TV9 Telugu
సొరకాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది అధిక సమయం ఆపటు కడుపు నిండినట్లు ఉంచుతుంది
TV9 Telugu
తద్వారా బరువు తగ్గడానికి, చక్కని శరీర ఆకృతికి సహాయపడుతుంది. సొరలోని ఫైబర్, నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది