ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడమే కాదు మునగాకు, మునక్కాడలు కూడా తప్పక తింటారు. వర్షాకాలంలో ఈ నియమం పెట్టడానికి, ఇది సంప్రదాయంగా మారడానికి వెనుక ఆరోగ్య ప్రయోజనాలే ప్రధాన కారణమంటారు పెద్దలు
TV9 Telugu
వానాకాలంలో బయటి ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. దీంతో అనేక అనారోగ్యాలూ పొంచి ఉంటాయి. అందుకే, వాటితో పోరాడే శక్తినీ, ఒంట్లో వేడినీ పెంచేందుకు మునగాకుని తినాలట
TV9 Telugu
వీటిల్లో విటమిన్ ఎ, సిలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది. ఈ ఆకుల్లో పుష్కలంగా దొరికే ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు.. పోషకాలలేమిని తీరుస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా ఇందులోని ఐరన్, కాల్షియం రక్తహీనతను తగ్గించి, ఎముకలను దృఢంగా మారుస్తాయి. బాలింతల్లో పాలు పడేలా చేస్తుంది
TV9 Telugu
మునగ... రక్తంలోని చక్కెర, కొవ్వుల్ని నియంత్రించి గుండె పనితీరుని సరి చేస్తుంది. గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నియంత్రించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది
TV9 Telugu
అలానే ఫైటో కెమికల్స్, పాలీఫినాల్స్ ఒంట్లోని మలినాలను బయటకు పంపించడంతో పాటు రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలిస్తాయి
TV9 Telugu
బీటా కెరొటిన్ దండిగా ఉండే మునగాకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. వీటిల్లోని పీచు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది
TV9 Telugu
పొటాషియం అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే మునగ ఆకులు, కాడలు రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు