వీటిని గుర్తుపట్టారా? రోజుకో కప్పు తిన్నారంటే సర్వరోగాలు మటాష్!
08 June 2025
TV9 Telugu
TV9 Telugu
దక్షిణాదిన మినపప్పుకి విశిష్ట స్థానం ఉంది. దీనితో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. ఈ పప్పుతో ఇడ్లీలు, దోసెలు, వడలు వంటి అల్పాహారాల తయారీలో మినపప్పు ప్రధానం
TV9 Telugu
అంతేకాదు వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఈ పప్పుతో ఘుమఘుమలాడే మినపగారెలు, సున్నుండలు చేసుకోవచ్చు. మినపప్పులో ఉండే ఐరన్ కంటెంట్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది
TV9 Telugu
మినపప్పులో రుచితోపాటు ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నివారణలో కూడా ఈ పప్పును వాడుతారు
TV9 Telugu
ఇది నిజంగానే సూపర్ ఫుడ్. ప్రతిరోజూ కనీసం ఒక కప్పు మినపప్పు తింటే శరీరానికి ఒంట్లో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కాదు. శాకాహారులకు మినపప్పు ప్రోటీన్ ఫుడ్. ఇందులో అధిక స్థాయిలో ప్రోటీన్ ఉంటుంది. ఇవి శరీర కణాల నిర్మాణం, మరమ్మత్తులో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది
TV9 Telugu
ఈ పప్పు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వలన ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది
TV9 Telugu
ఇందులో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
దీనిలోని ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. తద్వారా అతిగా తినే ధోరణి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పప్పులో ఐరన్, విటమిన్ బి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి