షుగర్ ఉన్నవారు శనగలు తింటే.. రక్తంలో చక్కెర పెరుగుతుందా?
13 May 2025
TV9 Telugu
TV9 Telugu
ముత్తైదువలకు వాయనంలో పసుపు కుంకుమలతోపాటు నానబెట్టిన సెనగల్నీ తప్పక ఇస్తుంటారు. గుళ్లలోనూ ఉడికించిన సెనగల్నే ప్రసాదంగా పంచుతుంటారు
TV9 Telugu
దాదాపుగా అందరి ఇళ్లలోనూ తప్పక కనిపించే చిరుతిండి సెనగ గుగ్గిళ్లు లేదా తాలింపు సెనగలు. సెనగల్ని వాయనంగా ఇచ్చినా ప్రసాదంగా పెట్టినా దాని వెనకున్న పరమార్థం ఒకటే.. పూజలూ పునస్కారాల పేరుతో చేసే ఉపవాసాలతో నీరసించిపోకుండానూ త్వరగా ఆకలి వేయకుండానూ ఉండేందుకేనట
TV9 Telugu
సీజన్‌లో దొరికే పచ్చి సెనక్కాయల్ని ఒలుచుకుని తినడంతోపాటు వేయించిన సెనగల్ని మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు. నిజానికి ఒకప్పటి పిల్లలకి గుప్పెడు వేయించిన సెనగలూ లేదా ఆ సెనగపప్పూ బెల్లాలే చిరుతిండి
TV9 Telugu
రోగాలు చుట్టుముట్టే ఈ కాలంలో సెనగల్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నదే ఈ ఆహారం వెనక ఆంతర్యం. అయితే గ్యాస్ వస్తుంది అనో, తింటే పడదనో ఈమధ్య చాలామంది వీటి పేరు చెబితేనే భయపడుతున్నారు
TV9 Telugu
కానీ పోషకాలు పుష్కలంగా ఉండే సెనగల్ని ‘దేశీ సూపర్ ఫుడ్’గా పేర్కొంటున్నారు ఆహార నిపుణులు. నల్ల శనగ పప్పులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
నల్ల శనగలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పప్పులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. శనగల్లో ఫైబర్‌తోపాటు మెగ్నీషియం కూడా ఉంటుంది
TV9 Telugu
ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. శనగలో శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల శనగలను ఉడికించి లేదా కూరగా ఎలా తీసుకున్నా మంచిదే