చియా విత్తనాలను ఇలా తీసుకుంటే డాక్టర్‌తో పనే ఉండదు..!

05 February 2025

TV9 Telugu

TV9 Telugu

క్యాల్షియం సమృద్ధిగా లభ్యమయ్యే పదార్థాల్లో చియా కూడా ఒకటి. వీటిని ఓట్స్‌తో కలిపి తినచ్చు లేదా ప్రత్యేకంగా వేయించుకునైనా తినచ్చు. 45 గ్రాముల చియా గింజల్లో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది

TV9 Telugu

ఈ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్‌ ...తదితర పోషకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం

TV9 Telugu

అందుకే చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు  దృఢంగా ఉంటాయి. వీటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం మెండు

TV9 Telugu

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేసి రక్తపోటును నియంత్రిస్తాయి. అయితే చాలా మందికి చియా విత్తనాలు ఎలా తీసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసం బెస్ట్ పద్ధతులు సూచిస్తున్నారు నిపుణులు

TV9 Telugu

చియా గింజలు ఒమేగా-3లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్. ఈ విత్తనాలను పాలతో కలిపి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది

TV9 Telugu

స్మూతీస్‌లో కూడా వీటిని తీసుకోవచ్చు. స్మూతీస్‌లో ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను వేసుకోవచ్చు. ఇవి రుచిని మార్చకుండా శరీరానికి సరిపడా పోషకాలను అందిస్తుంది

TV9 Telugu

అలాగే ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌లోకి తీసుకోవచ్చు. పెరుగు లేదా ఓట్ మీల్ పైన చియా విత్తనాలను చల్లుకొని తీసుకోవచ్చు. చియా విత్తనాలను నీటితో నానబెట్టి వీటిని హైడ్రేటింగ్ డ్రింక్‌లో కూడా తాగొచ్చు

TV9 Telugu

చియా విత్తనాలను ఓట్స్, తేనె, ఇతర పదార్థాలతో కలిపి ఇంట్లోనే స్వంతంగా ఎనర్జీ బార్‌లను తయారు చేసుకోవచ్చు. సలాడ్స్‌లలో అదనపు పోషకాలను జోడించడానికి చియా విత్తనాలను చల్లుకుని హాయిగా ఆరగించవచ్చు