ఎప్పుడైనా మధ్యాహ్నం వేళ పాలు తాగారా? ఈ మార్పు గమనించండి
05 February 2025
TV9 Telugu
TV9 Telugu
మనిషి ఆరోగ్యానికి పాలు, వాటి ఉత్పత్తుల వినియోగం కీలకం. అవి విలువైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు
TV9 Telugu
క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు. అయినా కూడా మనలో చాలామంది తగినన్ని పాలు తాగటం లేదు. పాలలోని పోషకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాల్షియం గురించే
TV9 Telugu
తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతాన్ని పొందినట్టే. ఎముకలను పటుత్వం చేయటంతో పాటు శక్తి విడుదల కావటానికీ తోడ్పడే పాస్ఫరస్ సైతం దీంతో లభిస్తుంది
TV9 Telugu
ఎముకల్లో క్యాల్షియం గట్టిపడగానికి దోహదం చేసే విటమిన్ డి కూడా పాలలో కొంతవరకు ఉంటుంది. పాలు సంపూర్ణ ఆహారం. రోజువారీ పనులకు కావాల్సిన శక్తినిచ్చే చక్కెర, ప్రోటీన్, కొవ్వులన్నీ దీంతో లభిస్తాయి
TV9 Telugu
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంతాగే పాలకు రోజు వారీ ఆహారంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పిల్లలు బాగా ఎదగడానికి పాలు తాగిపిస్తుంటారు. అయితే కొంతమంది పగటిపూట లేదా రాత్రి పడుకునే ముందు పాలు తాగుతారు
TV9 Telugu
కానీ మధ్యాహ్నం పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నం పాలు తాగడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది
TV9 Telugu
పాలలో కాల్షియంతో పాటు, ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన భాస్వరం, విటమిన్ డి, ప్రోటీన్లు కూడా ఉంటాయి. పాలు తాగడం వల్ల ఒత్తిడి మాయం అవుతుంది
TV9 Telugu
పాలలో ఉండే అమైనో ఆమ్లాలు కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నవారు రోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. ఇది బి12 లోపాన్ని నివారిస్తుంది