రోజుకో పచ్చి పసుపు ముక్క తిన్నారంటే.. మ్యాజిక్ చూస్తారు!

22 July 2025

TV9 Telugu

TV9 Telugu

భారతీయుల వంటల్లో పసుపు పాత్ర ఎంతో కీలకం. కారణం... పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు. ఇవి వ్యాధులని దూరం చేసి రోగాల చింతలన్నీ పారదోలుతాయి

TV9 Telugu

దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు గోల్డెన్‌ మిల్క్‌ తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది

TV9 Telugu

గ్లాసుడు పాలను స్టవ్‌ మీద పెట్టి చెంచాడు పసుపు, చెంచాడు తేనె, కొద్దిగా నెయ్యి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తక్కువ మంట మీద కాసేపు మరగనిస్తే గోల్డెన్‌ మిల్క్‌ రెడీ. వీటిని రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే ఎంతో మంచిది

TV9 Telugu

పసుపులో విటమిన్లు, మినరల్స్‌, మాంగనీస్‌, ఇనుము, పీచు, విటమిన్‌ బి6, కాపర్‌, పొటాషియం ఉంటాయి. రోజూ పసుపును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానిలో పది శాతం ఇనుము అందుతుంది

TV9 Telugu

మీరెప్పుడైనా పచ్చి పసుపు తిన్నారా? చూసేందుకు అచ్చం అల్లం మాదిరి ఉండే పచ్చి పసుపు.. చిన్న ముక్క నోట్లో వేసుకుని నమిలితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది

TV9 Telugu

పసుపులో ఉండే కుర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, ఆమ్లత్వం మొదలైన జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది

TV9 Telugu

పచ్చి పసుపు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె జబ్బులకు కారణమయ్యే కొన్ని విషయాలతో పోరాడగలదు. పచ్చి పసుపు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది

TV9 Telugu

పచ్చి పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మధుమేహం ఉన్నవారు పచ్చి పసుపు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు