రోజూ ఖాళీ కడుపుతో తేనె తింటే ఏమవుతుందో తెలుసా?

26 November 2025

TV9 Telugu

TV9 Telugu

తేనెను గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే వాస్త‌వానికి తేనెను రోజూ తీసుకోవ‌చ్చు. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే 1 టీస్పూన్ మోతాదులో తేనెను తీసుకుంటుంటే అనేక లాభాలు ఉన్నాయి

TV9 Telugu

తేనెలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. స‌హ‌జ‌సిద్ధంగా త‌యారైన తేనెలో కొన్ని ర‌కాల ఎంజైమ్‌లు ఉంటాయి

TV9 Telugu

దీన్ని తీసుకుంటే పిత్తాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది. పైత్య ర‌సాలు స‌రిగ్గా ఉత్ప‌త్తి అవుతాయి. దీని వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు, టాక్సిన్లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి

TV9 Telugu

శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. తేనె ప్రీ బ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తుంది. ప‌ర‌గ‌డుపునే తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వస్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది

TV9 Telugu

పొట్ట‌లో అధికంగా యాసిడ్లు ఉత్ప‌త్తి అయ్యే వారు క‌డుపులో మంట‌, అజీర్తి, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ తేనెను తీసుకుంటే ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది

TV9 Telugu

తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవ‌నాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, వాపుల‌ను త‌గ్గించి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థను ప‌టిష్టంగా మారుస్తుంది

TV9 Telugu

ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గుతాయి. తేనెలో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక దీన్ని తీసుకుంటే బ్యాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు

TV9 Telugu

తేనెను ఉద‌యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని వ‌ల్ల క్యాల‌రీలు ఖర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న వారు రోజూ తేనెను తీసుకోవ‌డం మంచిది