పాలల్లో 2 ఖర్జూరాలు మరిగించి గోరు వెచ్చగా తాగితే.. 

02 December 2025

TV9 Telugu

TV9 Telugu

పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్‌ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు

TV9 Telugu

పాలలోని పోషకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాల్షియం గురించే. ఈ విషయంలో పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. ఆకుకూరల్లో క్యాల్షియం అత్యధికంగా ఉన్నా దీన్ని మన శరీరం అంతగా గ్రహించలేదు

TV9 Telugu

అదే పాల ద్వారా లభించే క్యాల్షియమైతే బాగా ఒంటపడుతుంది. తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతాన్ని పొందినట్టే. ఎముకలను పటుత్వానికి తోడ్పడే పాస్ఫరస్‌, క్యాల్షియం, విటమిన్‌ డి కూడా పాలలో కొంతవరకు ఉంటుంది

TV9 Telugu

పాలలో వేడిని కలిగించే గుణాలు ఉన్నాయి. చలికాలంలో రాత్రిపూట పాలు తాగడం మంచిది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు పాలు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా చల్లని వాతావరణంలో పాలతో ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో ఖర్జూరాలు తినడం వల్ల శక్తి లభిస్తుంది

TV9 Telugu

చల్లని వాతావరణంలో ఖర్జూరాలు తినడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది

TV9 Telugu

ఖర్జూరాలను పాలలో మరిగించి తినడం మంచిది. రోజు 2 నుండి 3 ఖర్జూరాలు తింటే సరిపోతుంది. ఎక్కువగా తినడం హానికరం. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు ఎక్కువగా తినకూడదు

TV9 Telugu

ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవి సహజంగా తీపిగా ఉంటాయి కాబట్టి, వాటితో ఇతర పదార్ధాలు ఏమీ కలపవలసిన అవసరం లేదు. నేరుగా తినవచ్చు