Moong 1

రోజూ ఉదయాన్నే నానబెట్టిన పెసలు తింటే.. ఒక్క నెల్లోనే ఊహించని మార్పు!

28 January 2025

image

TV9 Telugu

శనగలు, కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పెసలు అలా కాదు. తేలిగ్గా జీర్ణమవుతాయి. మన తెలుగువాళ్లకి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందుంటుంది. రుబ్బి, అట్టేయడం సంగతలా ఉంచితే.. నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా రుచిగానే ఉంటాయి

పెసలెంతో శ్రేష్ఠం అంటారు కదా.. ఎందుకంటే- వీటిల్లో ఎ, సి విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, సోడియం, ఐరన్, క్యాల్షియం.. ఇన్ని పోషకాలున్నాయి మరి. పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

పెసలెంతో శ్రేష్ఠం అంటారు కదా.. ఎందుకంటే- వీటిల్లో ఎ, సి విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, సోడియం, ఐరన్, క్యాల్షియం.. ఇన్ని పోషకాలున్నాయి మరి. పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి

పెసర పప్పులో ప్రోటీన్ అధిర మొత్తంలో ఉంటుంది. వీటితోపాటు కాల్షియం, బి6, మెగ్నీషియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి

TV9 Telugu

పెసర పప్పులో ప్రోటీన్ అధిర మొత్తంలో ఉంటుంది. వీటితోపాటు కాల్షియం, బి6, మెగ్నీషియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి

TV9 Telugu

ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన పెసలు బ్రేక్‌ ఫాస్‌గా తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కండరాలకు బలాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

TV9 Telugu

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన పచ్చి పెసలు తింటే, కొన్ని రోజుల్లో మరింత చురుకుగా మారి ఒంట్లో నీరసం మాయం అవుతుంది. పెసర పప్పు తీసుకోవడం వల్ల కాల్షియం, మెగ్నీషియం కూడా అందుతాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది

TV9 Telugu

నానబెట్టిన పెసలు తినడం ద్వారా, శరీరానికి ప్రోటీన్‌తో పాటు విటమిన్ సి లభిస్తుంది. ఈ రెండు పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి

TV9 Telugu

రోజూ నానబెట్టిన పెసలు తినడం వల్ల జుట్టు రాలడం, చర్మ సమస్యలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరంలో రక్త హీణత సమస్య కూడా మాయం అవుతుంది

TV9 Telugu

కొలెస్ట్రాల్‌ స్థాయి క్రమబద్ధంగా ఉండేందుకు తోడ్పడతాయి. గుండె జబ్బులను రానివ్వవు. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి