ఏడాదంతా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. దీని గింజల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.వాస్తవానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే
TV9 Telugu
చిన్న దానిమ్మ గింజలు చూసేందుకు అచ్చంగా కెంపుల్లా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం ఒక గిన్నెడు దానిమ్మ గింజలతో మీ రోజును ప్రారంభిస్తే ఆరోగ్యంలో ఎన్నో మార్పులను చూడవచ్చు
TV9 Telugu
దానిమ్మలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి
TV9 Telugu
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె దానిమ్మపండు తింటే ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి ఉదయం దానిమ్మ గింజల్లో కాసింత నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పును జోడించి తింటే పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి
TV9 Telugu
ప్రతి ఉదయం దానిమ్మ విత్తనాలు తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. మిమ్మల్ని మరింత చురుగ్గా, శక్తివంతంగా ఉంచుతుంది
TV9 Telugu
ప్రతి ఉదయం దానిమ్మ గింజలు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ కూడా కాపాడుకోవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
TV9 Telugu
అలాగే ఒంట్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. చర్మం మెరుస్తుంది. ఇది అకాల వృద్ధాప్యం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మీరు తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు
TV9 Telugu
ఇది నాడీ వ్యవస్థ (మెదడు) కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి