బొప్పాయి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తింటే.. జరిగేదిదే!
12 May 2025
TV9 Telugu
TV9 Telugu
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... ఇది బొప్పాయితో లాభం. అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు
TV9 Telugu
విటమిన్ ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు... లాంటి పోషకాలెన్నో ఉంటాయి బొప్పాయిలో. దీన్లో అధిక మోతాదులో ఫైబర్ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది
TV9 Telugu
ఇది చర్మం నుంచి విషాన్ని తొలగించి మెరుపును పెంచుతుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు తగ్గుతాయి. దీంతో చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇవి శరీరం నుండిచి విషాన్ని తొలగించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
ఈ పండు విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి విటమిన్ ఎ, సిలకు మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఒక నెల పాటు రోజువారీ వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
TV9 Telugu
ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. తక్కువ కేలరీలు, డీటాక్స్ లక్షణాల కారణంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇందులోని తక్కువ కేలరీలు, డీటాక్స్ లక్షణాల కారణంగా వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఒక నెల పాటు రోజూ తీసుకోవడం వల్ల గుండె బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది