చలికాలంలో రోజుకొక్క వెల్లుల్లి రెబ్బ తిన్నారంటే..

05 December 2024

TV9 Telugu

TV9 Telugu

లేత పసుపు రంగులో, ఘాటుగా వంటకాలకు మరింత రుచిని అందించే వెల్లుల్లి ప్రతి ఇంటి వంట గదిలో తప్పనిసరిగా ఉంటుంది. రుచికే కాదు వెల్లుల్లి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది

TV9 Telugu

వెల్లుల్లిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, అల్లిసిన్, సల్ఫర్, మెగ్నీషియం, ఫైబర్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

TV9 Telugu

వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది

TV9 Telugu

వెల్లుల్లిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు నయమవుతాయి. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు జలుబు, దగ్గు రాకుండా కాపాడుతాయి

TV9 Telugu

ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా రకరకాల ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెడుతుంది. దగ్గు, జలుబులను దరి చేరనీయదు

TV9 Telugu

వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. దీంట్లో మాంగనీస్‌, సెలీనియంలతోపాటు విటమిన్‌-బి6, సి ఉంటాయి. పీచూ తగిన మొత్తంలో ఉంటుంది

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో రోజుకొక్క రెబ్బ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. వెల్లుల్లి రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

TV9 Telugu

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది