Dates 4

ఖర్జూరంతో అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

29 January 2025

image

TV9 Telugu

సీజన్‌తో సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా పండుతుంది. పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం... శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా ప్రసాదంగా పంచే పవిత్ర ఫలం... అదే మనందరికీ సుపరిచితమైన అరటిపండు

పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ అరటి పండు మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మృదువుగా ఉంటుంది కాబట్టి అన్నం కన్నా ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం కూడా ఇదే

నిజానికి రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడితో పని ఉండదు అంటారు కానీ, రోజుకో అరటిపండు తిన్నా చాలు, సకల రోగాల నుంచీ సంరక్షిస్తుంది. అయితే అరటిపండును ఖర్జూరంతో కలిపి తింటే మరింత మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు

యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. ఖర్జూరంతో అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది

TV9 Telugu

పాలు, అరటిపండు, ఖర్జూరంతో చేసిన మిల్స్‌ షేక్ తాగడం వల్ల అలసట, బలహీనత కూడా తొలగిపోతాయి. అరటిపండ్లు, ఖర్జూరాల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అలాగే ఈ రెండింటినీ తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే, అరటిపండు, ఖర్జూరాలను మెత్తగా జ్యూస్‌ మాదిరి కలిపి తాగేయండి

TV9 Telugu

ఇది జీర్ణక్రియను చక్కగా మారుస్తుంది. ఉదయాన్నే అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండు, ఖర్జూరం కలిపిన పాలను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

TV9 Telugu

అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతుంది. సన్నగా ఉన్నవారు అరటిపండ్లు, ఖర్జూర పండ్లను తినడం వల్ల బరువు సులువుగా పెరిగిపోతారు