శనగలను చూడగానే కంటికి ఇంపుగా ఉండవు. తినాలన్నా చిన్నారులకు ఇష్టం అనిపించదు కానీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాటి రుచిని, వాటిలో ఉండే పోషకాలను చక్కగా వివరిస్తారు
TV9 Telugu
ఇప్పటి తరం చిన్నారులు, పెద్దలు ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటంతో ఆరోగ్యకరమైన ఆహారం చిన్నారులకు అందడం లేదు. ఎన్నో విటమిన్లు, పోషకాలున్న శనగలను అల్పాహారంగా అందిస్తే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
రోజూ కొంచెం తింటే బరువు తగ్గడంతో పాటు మధుమేహం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకున్నవారు, మధుమేహం అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటే నల్ల శనగలను తినాలి. ఇందులో పీచు అధికంగా ఉంటుంది. ఇది శాకాహారులకు బలవర్ధక ఆహారంగా చెప్పొచ్చు
TV9 Telugu
ఉడికించిన శనగల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, పొటాషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఉడికించిన శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉడికించిన శనగల్లో ఇనుము, జింక్, మెగ్నీషియం దండిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరానికి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడటానికి బలాన్ని ఇస్తుంది. ఉడికించిన శనగల్లో ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
TV9 Telugu
ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఉడికించిన నల్ల శనగల్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం కూడా ఉంటాయి. ఈ మూలకాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే ఇది ఎముకలకు చాలా ముఖ్యమైనది
TV9 Telugu
నల్ల శనగల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పైగా ఇవి కడుపు ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతాయి. దీనివల్ల పదే పదే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది