బెండ నీటిలో కాస్త నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగారంటే..

26 June 2025

TV9 Telugu

TV9 Telugu

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారా? ఆహారంలో బెండకాయను చేర్చుకోండి. ఇది కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది

TV9 Telugu

మనుషుల్లోనూ బెండకాయ ఇలాంటి ప్రభావమే చూపుతుందని కచ్చితంగా చెప్పలేకపోవచ్చు గానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి

TV9 Telugu

బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ దండిగా ఉంటాయి. విజృంఖల కణాల పనిపట్టే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి

TV9 Telugu

బెండకాయ రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చేస్తుంది

TV9 Telugu

బెండకాయలో పీచూ ఎక్కువే. ఇవన్నీ పరోక్షంగా గుండెకు మేలు చేసేవే. గుండెజబ్బులను నివారించేవే. అయితే బెండకాయ ముక్కలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు

TV9 Telugu

అయితే బెండ ముక్కలను కోసి రాత్రంతా నీటిలో నానబెట్టి అందులో కాసింత నిమ్మరసంతో కలిపి తాగితే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ఈ నీళ్లు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఈ రెండింటిలోనూ తక్కువ కేలరీలు, పుష్కలంగా ఫైబర్ ఉంటుంది

TV9 Telugu

దీని కారణంగా కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. ఇది జీవక్రియను పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది