రాత్రి నిద్రకు ముందు పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగారంటే..

15 July 2025

TV9 Telugu

TV9 Telugu

మనం వంటల్లో ఎక్కువగా వాడే మసాలా దినుసుల్లో నల్లమిరియాలు ఒకటి. వంటలకు కాస్త ఘాటును ఇచ్చినా.. ఇవి చేసే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు

TV9 Telugu

దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, చర్మం నిగారింపుని సంతరించుకోవడానికీ, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడానికీ ఈ నల్ల మిరియాలు ఎంతో సహకరిస్తాయి

TV9 Telugu

అంతేకాదు మనం తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు గ్రహించే శక్తి ఈ మిరియాలకు ఎక్కువగా ఉంటుందట. అందుకే సలాడ్లు, సూపుల్లో మిర్చీకి బదులుగా మిరియాలపొడి వేస్తే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అలాగే చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పసుపు కలిపిన పాలు తాగుతారు. అయితే మీరెప్పుడైనా రాత్రి పడుకునే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు తాగారా?

TV9 Telugu

రాత్రి పడుకునే ముందు మిరియాల పొడి కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. నల్ల మిరియాల పొడి కలిపిన పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి తేలిగ్గా ఉపశమనం పొందొచ్చు. ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది

TV9 Telugu

పాలలో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. అదనంగా నల్ల మిరియాలు జోడించడం వల్ల పాల పోషక విలువలు మరింత పెరుగుతాయి. నల్ల మిరియాలలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వాపుతో పోరాడి కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి

TV9 Telugu

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల గోరువెచ్చని పాలతో ఈ పొడి కలిపి తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం సమస్య ఇట్టే నయమవుతుంది. అసిడిటీ, మలబద్ధకం సమస్యలు తగ్గించి జీవక్రియను వేగవంతం చేస్తుంది