నీళ్లు కాదు అమృతం.. రోజూ ఖాళీ కడుపుతో గ్లాసుడు తాగారంటే!
11 April 2025
TV9 Telugu
TV9 Telugu
ప్రతి వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వంట మసాలా జీలకర్ర. ఇది వంటలకు రుచిని మాత్రమేకాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది
TV9 Telugu
జీర్ణానికి సహాయపడే వాటిలో జీలకర్ర ఒకటి. దోరగా వేయించి చిటికెడు ఉప్పుతో కలిపి నోట్లో వేసుకుని నమిలితే చాలు... వాంతులను ఆపేయొచ్చు
TV9 Telugu
వేసవిలో జీలకర్ర నీళ్లు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం జీలకర్ర నీరు కడుపుకు దివ్యౌషధం. కానీ దానిని సరైన రీతిలో తాగటం చాలా ముఖ్యం
TV9 Telugu
ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి వడకట్టాలి. అది చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో తాగాలి
TV9 Telugu
ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రుచి కోసం నిమ్మరసం అందులో కాసిన్ని చుక్కలు కలిపి తాగవచ్చు
TV9 Telugu
జీలకర్ర నీటిలో కొవ్వును కాల్చే గుణం ఉంది. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మాంగనీస్ మరియు సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా కనిపిస్తాయి
TV9 Telugu
జీలకర్రలోని ఈ గుణాలు చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు ఉదయాన్నే దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది
TV9 Telugu
జీర్ణప్రక్రియ మెరుగుపడటానికీ ఇది సహాయపడుతుంది. శరీరంలోని విష వ్యర్థాలు బయటకి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది