డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు
TV9 Telugu
అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు
TV9 Telugu
మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే క్రమం తప్పకుండా తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు బరువు తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి
TV9 Telugu
ముఖ్యంగా శీతాకాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడే ఆహారం తీసుకోవాలి. తద్వారా బలమైన రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది
TV9 Telugu
శీతాకాలంలో బాదం పప్పును ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఎందుకంటే వాటిలోని పోషకాలు శరీరాన్ని వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి
TV9 Telugu
28 గ్రాముల బాదం పప్పులో 3.5 గ్రాముల ఫైబర్, 6 గ్రాముల మొక్కల ఆధారిత ప్రోటీన్, 14 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, విటమిన్ E రోజువారీ విలువలో 48 శాతం, మాంగనీస్ 27 శాతం, మెగ్నీషియం 18 శాతం ఉంటాయి
TV9 Telugu
ఆహారంలో ఎన్ని బాదంపప్పులు చేర్చుకోవాలనే వయస్సు, లింగం, శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తి రోజుకు 5 నుండి 10 నానబెట్టిన బాదంపప్పులు తినవచ్చు