రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుప్పెడు మఖానా తింటే..!
20 February 2025
TV9 Telugu
TV9 Telugu
తామర గింజలు.. వీటినే మఖానా అంటారు. వేల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయ ఆహారంలో భాగమైన మఖానాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు వీటి నుంచి శరీరానికి అందుతాయి
TV9 Telugu
ఇందులో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మరియు భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి
TV9 Telugu
మఖానాతో పాయసం చేసుకోవచ్చు. కూరా వండుకోవచ్చు... ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు వారానికోసారి వీటిని తింటే సరి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి
TV9 Telugu
మఖానాలో మెరుగ్గా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. మఖానాల్లో ఫైటో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అలానే వీటిల్లోని ఆల్కలాయిడ్స్, సెపోనిన్స్, గాలిక్ యాసిడ్‌లు గుండెకు రక్షణగా నిలబడతాయి
TV9 Telugu
అయితే రోజుకు 15 నుండి 20 మఖానా గింజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఉదయం ఖాళీ కడుపుతో మఖానా గింజలను తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది
TV9 Telugu
ఉదయం ఖాళీ కడుపుతో మఖానా తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ గింజల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది