భోజనానికి ముందా.. తర్వాతా.. ఏ టైంలో మజ్జిగ తాగాలి?
15 May 2025
TV9 Telugu
TV9 Telugu
ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి పలువురు శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. శీతలపానీయాలు తాగితే మధుమేహం బారినపడాల్సి వస్తుందని అధిక మంది మజ్జికనే తాగుతుంటారు
TV9 Telugu
ముఖ్యంగా వేసవిలో మజ్జిగను ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
TV9 Telugu
మజ్జిగలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ప్రోటీన్, కాల్షియం, విటమిన్లకు మంచి మూలం. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది
TV9 Telugu
సాధారణంగా చాలా మంది ఆహారంతో మజ్జిగ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది భోజనంకి ముందు మజ్జిగ తాగుతారు. మరికొందరు రాత్రి భోజనం తర్వాత తాగుతుంటారు. కానీ మజ్జిగ తాగడానికి సరైన సమయం ఏది అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
TV9 Telugu
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత మజ్జిగ తాగాలి. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నిజానికి, మజ్జిగ రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు
TV9 Telugu
కానీ ఆహారంతో పాటు లేదా ముందు మజ్జిగ తాగకూడదు. అదే సమయంలో రాత్రిపూట మజ్జిగ తాగకపోవడమే మంచిది. రోజుకు 1-2 గ్లాసుల మజ్జిగ తాగడం మంచిది
TV9 Telugu
ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు పరిమాణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు
TV9 Telugu
మజ్జిగ ఎముకలకు మేలు చేస్తుంది. మజ్జిగలో జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది