నెల పాటు రోజూ గ్లాస్ బీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
17 January 2025
TV9 Telugu
TV9 Telugu
పార్టీ ఏదైనా చల్లని బీరు లేకుంటే ఆ లోటు ఇట్టే తెలుస్తుంది. అందుకే బ్యాచిలర్స్ సమయం దొరికనప్పుడల్లా చేతిలో బీరు సీసాతో సెటిలై పోతుంటారు
TV9 Telugu
అయితే చాలా మంది మేం తాగేది బ్రాందీ కాదు.. బీరే కదా అని తాము చేసే పనిని తెలివిగా సమర్థించుకుంటారు కూడా. కానీ బీరే కదాని పరిమితికి మించి తాగేస్తే.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది
TV9 Telugu
అయితే కొందరు మాత్రం బీరు తాగడం వల్ల ఎలాంటి హాని ఉండదని, బీర్ తాగడం వల్ల శరీరానికి మేలేగానీ కీడు జరగదని పలువురు చెబుతున్నారు
TV9 Telugu
నిజానికి బీర్ తీసుకోవడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. కానీ రోజూ ఎక్కువగా బీర్ తాగితే మాత్రం శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది
TV9 Telugu
ప్రతిరోజు బీర్ తాగడం వల్ల బరువు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే క్యాలరీల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు కాలేయం, ఆల్కహాలిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు రోజూ బీర్ తాగడం వల్ల కలిగే సమస్యలు
TV9 Telugu
అదే ఒక వ్యక్తి 21 రోజుల పాటు నిరంతరం బీర్ తాగితే, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. మూత్ర విసర్జనకు ఇబ్బంది ఎదురవుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీని వల్ల డిప్రెషన్ వస్తుంది
TV9 Telugu
ఇది కార్డియోమయోపతి, స్ట్రోక్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అతిగా బీర్ తాగడం వల్ల అలసట, నిద్రలేమిని కలిగిస్తుంది. రోజుకు 90 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది
TV9 Telugu
కాలేయం పరిమాణం కుంచించుకుపోయి పనితీరు దెబ్బతింటుంది. దీన్నే ‘లివర్ సిర్రోసిస్’ అంటారు ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్నవారు.. అదేపనిగా ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా త్వరగా కాలేయం పాడైపోతుంది