రాత్రి నిద్రకు ముందు పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగారంటే..

14 June 2025

TV9 Telugu

TV9 Telugu

పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే... జలుబు పరార్‌! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది.. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాల ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు

TV9 Telugu

వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతాయి

TV9 Telugu

చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పసుపు కలిపిన పాలు తాగుతారు. అయితే రాత్రి పడుకునే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు మీరెప్పుడైనా తాగారా? రాత్రి పడుకునే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి

TV9 Telugu

పాలలో కొద్దిగా నల్ల మిరియాల పొడి కలిపితే దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అనేక వ్యాధుల నుంచి ఆ వ్యక్తిని రక్షిస్తాయి

TV9 Telugu

నల్ల మిరియాలతో కలిపిన పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది. పాలలో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి

TV9 Telugu

పాలకు నల్ల మిరియాలు జోడించడం వల్ల పాల పోషక విలువలు మరింత పెరుగుతాయి. నల్ల మిరియాలు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి

TV9 Telugu

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చని పాలతో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం సమస్య నయమవుతుంది

TV9 Telugu

నల్ల మిరియాల పాలు తాగడం వల్ల అసిడిటీ, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకుంటే నల్ల మిరియాల పాలు తాగవచ్చు. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది