శీతాకాలంలో శరీర జీవక్రియ మందగిస్తుంది. కాబట్టి ఈ కాలంలో చల్లని స్వభావం కలిగిన పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మరింత ప్రభావితం చేస్తుంది
TV9 Telugu
కొన్ని పండ్లు శ్లేష్మం ఉత్పత్తిని మరింతగా పెంచుతాయి. ఇవి జలుబును మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శీతాకాలంలో ఏ పండ్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
ముఖ్యంగా ఈ కాలంలో పుచ్చకాయ శరీరాన్ని మరింత చల్లబరుస్తుంది. బట్టి శీతాకాలంలో దీనిని తినడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి
TV9 Telugu
పుచ్చకాయ చల్లని స్వభావం జీర్ణక్రియను బలహీనంగా మారుస్తుంది. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం కావడం చాలా కష్టం. ఈ పండు శ్లేష్మాన్ని పెంచి, జలుబును ప్రేరేపిస్తుంది
TV9 Telugu
పైనాపిల్ కూడా చల్లదనాన్నిచ్చే పండు. సున్నితమైన ఆరోగ్యం కలిగిన వ్యక్తులలో ఇది గొంతు నొప్పి, అలెర్జీలను ప్రేరేపిస్తుంది. శీతాకాలంలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది
TV9 Telugu
అరటిపండ్లు చలి కాలంలో శ్లేష్మం స్రావాన్ని పెంచుతాయి. చాలా మందికి ఉదయం అరటిపండు తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపిస్తుంది. అందుకే శీతాకాలంలో వాటి వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది
TV9 Telugu
ద్రాక్ష శరీరాన్ని చల్లబరుస్తుంది. దగ్గు, జలుబులను ప్రేరేపిస్తుంది. వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి
TV9 Telugu
ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ, కివీ వంటి పండ్లు శీతాకాలంలో తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి వెచ్చదనం, శక్తిని అందిస్తాయి